Kidambi Srikanth beat Japan's Kenta Nishimoto to win the French Open Super Series title on Sunday. Srikanth displayed some great net play and was aggressive with his smashes to breeze past his opponent 21-14, 21-13 in just 34 minutes.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పైనల్లో 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటాపై అలవోక విజయం సాధించాడు.
తొలి గేమ్‌ను 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించి 21- 13తో విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో టైటిల్ సాధించాడు. అంతేకాదు సూపర్ సిరీస్ టైటిల్స్ విజయాల్లో హ్యాట్రిక్ సాధించాడు.
అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఘతన సాధించాడు. పైనల్లో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటా ఏ దశలోనూ శ్రీకాంత్‌కి పోటీ ఇవ్వలేకపోయాడు. తాజా టైటిల్‌తో ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన నాలుగో పురుష షట్లర్‌గా శ్రీకాంత్ నిలిచాడు.
అంతకముందు లిన్ డాన్ (చైనా), లీ చాంగ్ వుయి (చైనీస్-మలేసియా), చెన్ లాంగ్ (చైనా) మాత్రమే ఈ ఘనత సాధించిన షట్లర్లు. అంతకముందు గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్‌కు పది రోజుల వ్యవధిలో ఇది మరో టైటిల్ కావడం విశేషం.